Sunday, February 23, 2025

శంషాబాద్‌లో అరకిలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized in shamshabad airport

నిన్న వెండిపూత.. నేడు రేడియం పూత

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడి నుంచి గురువారం నాడు అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్‌కు జె9 403 నంబరు గల విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 551.21 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంపై రేడియం పూత పూసి ఇద్దరు మహిళల హ్యాండ్ బ్యాగులకు అమర్చి అక్రమంగా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా బుధవారం నాడు ఓ మహిళ బంగారు చైన్‌కు వెండిపూతతో బంగారం తరలిస్తూ పట్టుబడిన విషయం విదితమే. తాజాగా కువైట్ నుంచి వచ్చిన ప్రయాణీకుడు మహిళల హ్యాండ్ బ్యాగ్‌లకు రేడియం పూతతో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుల వస్తు సామాగ్రిని సైతం క్షుణ్ణంగా తనికీలు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News