Sunday, December 22, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: దుబాయ్ నుంచి వేర్వేరు విమానాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 826 గ్రాముల అక్రమ బంగారాన్ని కస్ట మ్స్ అధికారులు గుర్తించారు. అధి కారులు తెలిపిన వివరాల ప్రకా రం… 6ఇ1484 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 127 గ్రాముల బంగారాన్ని పేస్ట్ గా తయారుచేసి దానిని పసిపిల్లకు తాగించే పౌడర్ డబ్బాలు వేసి తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు.

నిందితుల వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇదే తరహాలో దుబాయ్ నుండి ఎ మిరేట్స్ ఈకె -524 విమానంలో వచ్చిన మహిళా ప్రయాణికురాలు 726 గ్రాముల బంగారాన్ని చైన్లుగా తయారు చేసి వాటిని చూసి దాచుకుని తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం 826 గ్రాములు దాని విలువ 53,15,121 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇద్దరు నిందితులపై విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News