Friday, November 22, 2024

కూలీకి రాలేదని…. దళిత మహిళపై దాష్టీకం

- Advertisement -
- Advertisement -

Gold smith attack on dalith family in MP

భోపాల్: కూలీ పనులకు రాలేదని దళిత కుటుంబంపై అగ్ర కులానికి చెందిన వ్యక్తులు దాడి చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఛాతర్ పూర్ జిల్లా బండార్ ఘడ్‌లో జరిగింది. గర్భంతో ఉన్న మహిళ మూడు రోజుల పాటు బంధించి రాడ్లతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. స్వర్ణ కులానికి ఓ వ్యక్తి తన పొలం పనులకు రావాలని గర్భంతో ఉన్న మహిళకు తెలిపాడు. వేరే పనులు ఉండడంతో తరువాత వస్తామని స్వర్ణకారుడికి తెలిపింది. పొలం పనులకు సదరు మహిళ రావడంలేదని అక్కసుతో కొందరి వ్యక్తులను తీసుకొని వచ్చి వారి ఇంటిపై స్వర్ణకారుడు దాడి చేశారు. ఇంట్లో మగవాళ్లను అంతం చేస్తామని, మూడు రోజుల పాటు బంధించారు. కొందరు యువకుల సాయంతో బాధితురాలు రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారి పంకజ్ శర్మ ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నారు. పిల్లల ఎదుటే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News