Sunday, December 22, 2024

కారు నుంచి కిలోన్నర బంగారం చోరీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ ః నిజామాబాద్ జిలా, ఆర్మూర్‌లోని డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్రకు సంబంధించిన కిలోన్నర బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి కారులో బంగారం తీసుకువచ్చి మహాలక్ష్మి కాలనీలోని మహాలక్ష్మి మందిరంలో పూజలు చేయడానికి వెళ్లి, తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న కిలోన్నర బంగారం కనిపించలేదని బాధితులు వాపోయారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషనో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివాహ శుభకార్యాలు ఉన్నందున బంగారాన్ని బ్యాంకు నుండి తీసుకువచ్చారా లేక సదరు బాధితులు

వడ్డీ వ్యాపారానికి సంబంధించిన బంగారం బ్యాంకు నుండి విడిపించుకుని తీసుకువచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సందర్శించినట్లు సమాచారం. కారులో ఉన్న బంగారం చోరీకి గురవడంతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం చోరీ కావడం స్థానికంగా కలకలం రేపింది. డిసిపి జయరాం ఆర్మూర్. బాల్కొండ సిఐలు, నిజామాబాద్ టాస్క్ ఫోర్క్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News