Wednesday, January 22, 2025

దుర్గాభవాని ఆలయంలో చోరీ.. 20 తులాల బంగారం, నగదు అపహరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మల్కాజ్ గిరిలోని గౌతంనగర్ సమీపంలో దుర్గాభవాని ఆలయంలో చోరి జరిగింది. శుక్రవారం రాత్రి ఆలయం గోడకు దొంగలు కన్నం పెట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న 20 తులాల బంగారం, 2 కిలోల వెండిని దొంగలు అపహరించుకుపోయారు. ఇక, కౌంటర్ లోని రూ.80వేలు, హుండీలో ఉన్న నగదును దొంగలించారు.

బంగారం, నగదుతోపాటు ఆలయంలో ఉన్న సిసి కెమరాల ఫుటేజ్ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News