Monday, December 23, 2024

మోత్కూర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

- Advertisement -
- Advertisement -

ఏడున్నర తులాల బంగారం, రూ.50 వేలు అపహరణ

Gold theft in Mothkur

మన తెలంగాణ/మోత్కూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని నార్కట్‌పల్లి రోడ్డులో రాజమల్లారెడ్డి కాలనీలో బద్దం నరేందర్‌రెడ్డి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. భార్య డెలివరీకి ఉండటంతో ఈనెల 9న ఇంటికి తాళం వేసి భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నరేందర్‌రెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్న శివరాత్రి ఎల్లమ్మ బోరు మోటార్ వేసేందుకు గేటు తీయగా తాళం వేసి ఉన్న నరేందర్‌రెడ్డి ఇంటి తలుపులు తెరిచి ఉండటం చూసి వెంటనే అతనికి ఫోన్ చేసి సమాచారం చెప్పింది. దీంతో నరేందర్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించాడు. దొంగలు ఇంటి తలుపు తాళం పగులకొట్టి లోనికి ప్రవేశించి బీరువాను తెరిచి అందులో దాచి పెట్టిన ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, ఐదు తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. రామన్నపేట సిఐ మోతీరాం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ వి.జానకి రాంరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News