Sunday, January 19, 2025

చెన్నైలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

చెన్నై: నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. శనివారం సాయంత్రం ఎయిర్ పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద కోటి రూపాయలు విలువైన 2.09కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కెట్లను బ్యాగులో దాచి తరలించేందుకు ప్రయత్నించిన ఐదుగురు కేటుగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన హరీశ్ అనే మరో ప్రయాణికుడి వద్ద నుంచి రూ.46.29 లక్షల విలువైన సౌదీ ధీరమ్స్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

Gold worth Rs 1 Crore Seized at Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News