Thursday, December 19, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.కోటి విలువైన బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు తనిఖీల్లో కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..దుబాయ్ నుండి ఈకె -524 విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడిని అధికారులు అనుమానంతో లగేజీ స్కానింగ్‌తో పాటు అతనిని కూడా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అతని వద్ద అక్రమంగా తీసుకువచ్చిన రూ. కోటి రూపాయలకు పైగా విలువ గల 1390.850 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఆ వ్యక్తి ధరించిన ఎడమకాలు షూలో బ్యాటరీ రూపంలో తీసుకువచ్చాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ చట్టం ప్రకారం 1962 నిబంధనల ప్రకారం అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News