- Advertisement -
పాదరక్షలలో బంగారం దాచుకుని వచ్చాడు ఓ విమాన ప్రయాణికుడు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన వ్యక్తిని సోదా చేయగా రూ 6.3 కోట్ల విలువైన బంగారం ఆయన బూట్ల అడుగున ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత ఘటన వివచరాలను డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగల వ్యాపారి అయితే ఈ వ్యక్తి భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడే ఓ గ్యాంగ్‌లో చురుకైన వ్యక్తిగా ఉన్నట్లు నిర్థారించారు. బ్యాంకాక్ నుంచి ఇక్కడి ఛత్రపతి శివాజీ మహారాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు ప్రయాణికుడిని పట్టుకున్నారు.
- Advertisement -