Thursday, January 23, 2025

అయోధ్యలో రాముడి గర్భగుడికి బంగారు తలుపులు బిగింపు..

- Advertisement -
- Advertisement -

జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశమంత రామజపం వినిపిస్తోంది. అయోధ్యలో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండడంతో ఆలయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో రాముడి గర్భగుడికి బంగారు తలుపులు బిగించారు. మంగళవారం బంగారు పూతతో తయారు చేసిన 18 ద్వారాలను అమర్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

హైదరాబాద్‌ బోయినపల్లిలోని అనురాధ టింబర్‌ డిపో ఈ బంగారు పూత ద్వారాలను తయారు చేశారు. తలుపుల తయారీకి బలార్షా టేకు ఉపయోగించారు. 18 ప్రధాన ద్వారాలతో పాటు మరో 100 తలుపులను సిద్ధం చేశారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News