Saturday, November 23, 2024

చదువుతోనే బంగారు భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు ః విద్యార్థులకు చదువుతోనే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ అన్నారు. సోమవారం పెబ్బేరు పురపాలక పరిధిలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థుల ప్రతిభ తెలుసుకునేందుకు పాఠ్య పుస్తకాలను చదివించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కరుణ శ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బాలికల్లో అక్షరాస్యత పెంచేందుకు కస్తూర్భా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని స్పష్టం చేశారు. చదువు ద్వారానే విద్యార్థులకు గుర్తింపు, ఉన్నతి లభిస్తుందని మండల విద్యాధికారి జయరాములు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ కర్రె స్వామి, కౌన్సిలర్ గోపి బాబు, విద్యాలయ అధికారిణి పద్మ, బారాసా నాయకులు సాయినాథ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News