Saturday, December 21, 2024

రామగుండం ఎన్టీపీసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీలో కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా కొనసాగడంతో ఇన్సి ట్యూట్ ఆఫ్ డైరెక్టర్ (ఐఓడి) నుంచి గోల్డెన్ పీకాక్ 2023 అవార్డును అందజేశారు. ఈ మేరకు గురువారం బెంగళూర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రామగుండం ఎన్టీపీసీ ఈడి సునీల్ కుమార్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డును అందజేసినట్లు స్థానిక అధికార ప్రతినిధి శుక్రవారం రోజున తెలిపారు.

రామగుండం ఎన్టీపీసీ వద్ద దేశంలోని అతి పెద్ద 100 మెగవాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ప్లాంట్, మియావాకి ప్లాంటేషన్ వద్ద పొల్యూషన్ కంట్రోల్ కోసం తీసుకున్న జాగ్రత్తలు, విద్యుత్ వాద, విఎఫ్‌డి లాంటి వాడకం చేయడంతో ఐఓడి గుర్తించి గోల్డెన్ పీకాక్ అవార్డును అందజేశారని అన్నారు. దేశ వ్యాప్తంగా 500 సంస్థలు పోటీ పడగా, రామగుండం ఎన్టీపీసీకి ప్రథమ స్థానంలో అవార్డు లభించిందని అన్నారు. ఈ అవార్డు గడిచిన నాలు గుసం వత్సరాలలో మూడు సార్లు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎజిఎం అశుతోష్ కుమార్, సీనియర్ మెనేజర్ మునగ వంశీ కృష్ణ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News