Monday, December 23, 2024

బంగారు తెలంగాణ కాంగ్రెతోనే సాధ్యం: సినీ నటి దివ్యవాణి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బంగారు తెలంగాణ కాంగ్రెతోనే సాధ్యమని సినీ నటి, దివ్యవాణి అన్నారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి మణిక్‌రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీతి, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌లో పనిచేయాలన్న తపనతోనే హస్తం పార్టీలో చేరానన్నారు.

విజన్ కలిగిన టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర గతంలో పనిచేయడం ఆనందంగా ఉందని, అయితే కొన్ని కారణాల వల్ల టిడిపి నుంచి బయటకు వచ్చానన్నారు. ప్రతి పేదవాడు బాగుపడాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆమె కోరారు. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమే అని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించినా బాధ్యతగా పనిచేస్తానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News