Friday, January 24, 2025

బంగారు తెలంగాణ కెసిఆర్‌తోనే సాధ్యం : మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: అన్ని వర్గాల వారి సంక్షేమానికి పాటు పడుతున్న సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని మల్కాజిగిరి ఎ మ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు –అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను ఆలయాలకు మంజూరు చేస్తున్న ఆర్ధిక సహాయాన్ని (చెక్కులను) శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి అందచేశారు. ఇందులో భాగంగా 141 దేవాలయాలకు సుమారు 56 లక్షల రూపాయుల చెక్‌లను ఆయా ఆలయ కమిటీ అధ్యక్ష, కా ర్యదర్శులకు పంపిణీ చేశారు. అదే విధంగా బిసి బంధు పథకం కింద కులవృత్తులు చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం 50మందికి మంజూరు చే సిన (ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయులు) చెక్‌లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డాకనే అన్ని వర్గాల వారి ఉత్సవాల సమయంలో వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేస్తుందన్నారు. ఈ ఏడాది మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ ఏడాది 141 దేవాలయాలకు రూ 56 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందచేసిందన్నారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆలయ కమిటీ వారికి అందచేసినట్లు తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ అని కొనియాడారు. ఇందులో భాగంగానే రైతుబంధు, దళిత బంధు, బిసి బంధు పథకాలు సిఎం కెసిఆర్ రూపోందించి విజయవంతంగా అర్హులైన వారందరికి ఆ ఫలాలను అందచేస్తున్నారని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్న సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్‌కు ప్రజలు అందరూ అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మేకల సునితరాముయాదవ్, సబితా అనిల్ కిశోర్, క్యానం రాజ్యలక్ష్మీ, మాజీ కార్పొరేటర్ జగధీష్‌గౌడ్, బిఆర్‌ఎస్ మల్కాజిగిరి అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీ నివాస్, సీనియర్ నాయకులు బద్దం పరుశురాంరెడ్డి, మేకల రాము యాదవ్, నిరంజన్, పిట్ల నాగరాజ్, భాగ్యానంద్‌రావు, బుద్ది నర్సింగరావు, ఎస్ ఆర్ ప్రసాద్, బాబు, సత్యనారాయణ, తులసీ సు రేష్, పీవీ సత్యనారాయణ, బైరు అనిల్, గంగాధరి కృష్ణ, బాలకృష్ణగుప్తా, ఫరీద్, ఆగమయ్య, బాలరాజుయాదవ్, గౌలీకర్ దినేష్, గౌలీకర్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News