Friday, December 20, 2024

సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కెటిఆర్ బర్త్‌డే వేడుకలు

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వామిత్ర మంత్రిప్రగడ, నాగేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. తెలగాణ అభివృద్ధికి అందరి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకల్లో బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు ప్రవీణ్ లేదెళ్ల, వేణునాథ్, సాయి యాదవ్, ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల, సురేష్ మండ, రాకేష్, సూర్యారావు, అశోక్, బాలరాజు, మిస్కిన్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News