Saturday, November 23, 2024

710 డబ్ల్యుపీ మాడ్యుల్‌ ను ప్రకటించిన గోల్డీ సోలార్‌

- Advertisement -
- Advertisement -

 

 

Goldi Solar Unveils 710 WP Module

న్యూఢిల్లీ: భారతదేశంలో నాణ్యతకు అమిత ప్రాధాన్యత అందించే సోలార్‌ బ్రాండ్‌ గోల్డీ సోలార్‌ తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలలో భాగంగా 5వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి ప్రణాళిక చేసినట్లు వెల్లడించింది. అదే సమయంలో, ఇది తమ నూతన, ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి ఆఫరింగ్‌ హెలోక్‌ ప్లస్‌ను సైతం విడుదల చేసినట్లు వెల్లడించింది. హెటెరో జంక్షన్‌ సాంకేతికతతో కూడిన అత్యధిక సామర్ధ్యం మరియు అతి తక్కువ కార్బన్‌ మాడ్యుల్‌ సిరీస్‌ ఇది. సమగ్రమైన, మాడ్యుల్‌, సెల్‌, ముడి పదార్ధాల తయారీ సామర్థ్యాలను కలిగిన వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్‌ కంపెనీగా నిలువాలని గోల్డీ సోలార్‌ లక్ష్యంగా చేసుకుంది. దీనికనుగుణంగా గుజరాత్‌లోని తమ సెల్‌ తయారీ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ నిర్ధేశించుకుంది. తదనంతరం, ఇది తమ సామర్ధ్యంను 5గిగా వాట్లకు చేర్చనుంది. అదనంగా, గోల్డీ సోలార్‌ తమ విభిన్నమైన విభాగాల వ్యాప్తంగా 4500కు పైగా ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళిక చేసింది. దీనితో తమ ప్రస్తుత సిబ్బందితో కలిపి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5500కు పైగా చేర్చనుంది.

ఈ అభివృద్ధి గురించి గోల్డీ సోలార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెప్టెన్‌ ఈశ్వర్‌ ధోలాకియా మాట్లాడుతూ ‘‘ప్రాధమిక స్ధాయిలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, గోల్డీ సోలార్‌ ఇప్పుడు 25%కు పైగా తమ ఉద్యోగులను తమ ప్రతిపాదిత తయారీ కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలలోని స్థానిక గిరిజనుల నుంచి తీసుకోనుంది. ఈ నూతన ఉద్యోగులకు పునరుత్పాదకాలలో తగిన శిక్షణ అందించేందుకు గోల్డీ సోలార్‌ ఇప్పుడు మూడు నెలల సర్టిఫికేషన్‌ కార్యక్రమాలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాల వద్ద అందించడానికి ప్రణాళిక చేసింది. వీటిని గుజరాత్‌లోని నవసారి వద్ద ఉన్న ఎన్‌ఎస్‌డీసీ (జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి) సహకారంతో తెరిచేందుకు ప్రణాళిక చేశాము’’ అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ ‘‘భవిష్యత్‌ శక్తి వనరులుగా పునరుత్పాదకాలు నిలుస్తాయి. నూతన ఉత్పత్తి మార్గం తెరువడంతో పాటుగా మాడ్యుల్‌ తయారీ కోసం సామర్థ్యం విస్తరించడమనే మా భావి ప్రణాళికలు స్వచ్ఛమైన శక్తి సరఫరాను పెంచడానికి మరియు శిలాజ ఇంధనాలను పెద్ద ఎత్తున భర్తీ చేయడానికి తోడ్పడేలా రూపొందించబడ్డాయి. గోల్డీ సోలార్‌ వద్ద, మేము గౌరవనీయ ప్రధానమంత్రి లక్ష్యమైన ఆత్మనిర్భర్‌ భారత్‌కు కట్టుబడి ఉన్నాము మరియు పునరుత్పాదక విద్యుత్‌ పరంగా భారత్‌ స్వీయ సమృద్ధి సాధించేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాము’’ అని అన్నారు.

అదనంగా, సంస్థ డైరెక్టర్‌ శ్రీ భరత్‌ భుట్‌ మాట్లాడుతూ ‘‘ స్ధిరంగా నాణ్యమైన మాడ్యుల్స్‌ను గోల్డీ సోలార్‌ సృష్టించడంతో పాటుగా పంపిణీ చేస్తుంటుంది. సమర్థవంతమైన మరియు ప్రభావవంతమైన ఉత్పత్తులను అందించాలనేది మా మంత్రం. మా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, మేము పూర్తిగా అంకితం చేసిన ఉత్పత్తి అభివృద్ధి మరియు ఆర్‌ అండ్‌ డీ టీమ్‌ను రూపొందించాలని ప్రయత్నిస్తున్నాము. తాజా హెచ్‌జెటీ సాంకేతికత ఆధారంగా 710 డబ్ల్యుపీ మాడ్యుల్‌ను ప్రకటించిన మొట్టమొదటి భారతీయ తయారీదారునిగా గోల్డీ నిలిచింది మరియు మా తాజా ఆఫరింగ్‌ హెలోక్‌ ప్లస్‌ ఈ పరిశ్రమలో గేమ్‌ ఛేంజర్‌ కానుందనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.

గోల్డీ సోలార్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రెసిడెంట్‌ – గ్లోబల్‌ హెడ్‌ హర్దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘ ఘర్‌ ఘర్‌ గోల్డీ, హర్‌ ఘర్‌ గోల్డీ అనే మా సిద్ధాంతం, భారతదేశంలో గోల్డీ సూపర్‌ను ఓ మాస్‌ బ్రాండ్‌గా సృష్టించాలనే మా కోరికకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం మేము ఐపీపీ, సీ అండ్‌ ఐ, ఈపీసీ, ఎక్స్‌పోర్ట్స్‌ మరియు తయారీ విభాగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. భారతీయ దేశీయ వినియోగదారుల మార్కెట్‌పై మేము దృష్టి సారించాము. దీనిద్వారా కీలకమైన భారతీయ నగరాలలో ఉనికిని చాటడం సాధ్యమవుతుంది. ప్రతిపాదిత సామర్ధ్య విస్తరణ కార్యక్రమాలతో మేము మా ఉనికిని వృద్ధి చేయగలమనే నమ్మకంతో ఉన్నాము. రాబోయే పునరుత్పాదక విప్లవంలో ప్రతి భారతీయుడూ పాల్గొనేలా చేయడంలో మా భవిష్యత్‌ రోడ్‌మ్యాప్‌ కీలక ముందడుగుగా నిలువనుంది’’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News