Friday, December 20, 2024

లవ్ ట్రాక్ చాలా సరదాగా ఉంటుంది

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్ వర్క్స్‌లో మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ విడుదలవుతుంది.

ఈ నేపథ్యంలో హీరోయిన్ గోల్డీ నిస్సీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నా పాత్ర పేరు మంగరత్నం. తను కానిస్టేబుల్. కొంచెం గ్రే షేడ్ వుంటుంది. మంగరత్నను హీరో బంగార్రాజు ఇష్టపడతాడు. లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత వుంటుంది. నా పాత్ర మొదటి నుంచి చివరి వరకూ ట్రావెల్ అవుతుంది. నలుగురి కోణంలో చూపించే కథ ఇది. నేను కానిస్టేబుల్, కార్తిక్ మెకానిక్. ఆ ఏరియాలో వుండే ఏకైక మెకానిక్ తనే. లవ్ ట్రాక్ కూడా చాలా సరదాగా, ముద్దుగా వుంటుంది. హాయిగా ఫ్యామిలీ కలిసి చూసే సినిమా ఇది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News