Thursday, January 23, 2025

నూతన హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించిన గోల్డ్‌మన్ సాచ్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోల్డ్‌మన్ సాచ్స్, భారతదేశంలో దాని నిరంతర వృద్ధిలో కీలక మైలురాయిని ప్రకటిస్తూ, హైదరాబాద్ లో నూతన అత్యాధునిక కార్యాలయం, ఒపెల్‌ ను ప్రారంభించినట్లు ఈ రోజు వెల్లడించింది. ఈ సంస్థ యొక్క క్లయింట్ ఆన్‌బోర్డింగ్ ప్రయత్నాలకు ఈ కార్యాలయం అత్యుత్తమ కేంద్రంగా ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ ఇంజనీరింగ్, గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ పార్టనర్‌షిప్‌లకు నిలయంగా నిలుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కె.టి.రామారావు ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ..“2021లో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను తొలుత ప్రారంభించిన తరువాత గోల్డ్‌మన్ సాచ్స్ నూతన దీర్ఘకాలిక కార్యాలయాన్ని ప్రారంభిస్తుండటం పట్ల నేను సంతోషంగా వున్నాను. ఇది హైదరాబాద్ లో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేయటానికి అవసరమైన మద్దతు అందించటం తో పాటుగా వారిని ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేలా, కృషి చేస్తున్న తెలంగాణ యొక్క సమగ్ర కార్యక్రమాలను ప్రతిబింబిస్తుంది. ఇది మన ప్రస్తుత గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్‌ల యొక్క శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థకు దోహదం చేస్తుంది. స్థానిక ప్రతిభకు ప్రపంచ అవకాశాలను సృష్టిస్తుంది. డిజిటల్ అక్షరాస్యత, మహిళా వ్యవస్థాపకత, స్థానిక వెండార్ ఎంగేజ్‌మెంట్‌లతో కూడిన కార్యక్రమాల ద్వారా స్థానిక సమాజాన్ని ఉద్ధరించడానికి చూపుతున్న గోల్డ్‌మన్ సాచ్స్ నిబద్ధతను నేను అభినందిస్తున్నాను” అని అన్నారు.

గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ గ్నోడ్ ఈ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. “భారతదేశంలో మా వృద్ధి కథ దేశం లోని అసాధారణ ప్రతిభతో శక్తివంతంగా ముందుకు సాగుతుంది. గత రెండు దశాబ్దాలుగా, సంస్థ యొక్క ప్రపంచ స్థాయి కార్యకలాపాలలో బెంగళూరు, హైదరాబాద్ అంతర్భాగంగా వున్నాయి. మా నూతన హైదరాబాద్ కార్యాలయం ప్రపంచ స్థాయి భారతీయ ప్రతిభ పట్ల సంస్థ యొక్క నిరంతర నిబద్ధతకు నిదర్శనం గా నిలుస్తుంది” అని అన్నారు.

గోల్డ్‌మన్ సాచ్స్ సర్వీసెస్ ఇండియా కంట్రీ హెడ్, గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంజినీరింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమతాని మాట్లాడుతూ..“ఈ నూతన హైదరాబాద్ కార్యాలయం సహకారం, ఆవిష్కరణ, స్థిరత్వం, అత్యాధునిక సాంకేతికత, మా ఉద్యోగులను స్థానికంగా నియమించటం, ప్రపంచవ్యాప్తంగా సహకరించడానికి తోడ్పడటంలో మా నిబద్ధత కు సంబంధించి మా ప్రాధాన్యతలను ఉదాహరిస్తుంది. కేవలం రెండేళ్ళలో, హైదరాబాద్‌లోని మా బృందాలు మా ఇంజనీరింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పునఃరూపకల్పన చేయడం, టాలెంట్ ఎంగేజ్మెంట్ ప్రక్రియల ద్వారా సంస్థ కోసం మెరుగైన క్లయింట్ అనుభవాన్ని, ఆదాయ మార్గాలను అందించటానికి లోతైన సామర్థ్యాలను ఏర్పరచుకున్నాయి” అని అన్నారు.

నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, గోల్డ్‌మన్ సాచ్స్ ఆసియా పసిఫిక్ (జపాన్ మినహా) ప్రెసిడెంట్ కెవిన్ స్నీడర్, ఇండియాలోని గోల్డ్‌మన్ సాచ్స్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోంజోయ్ ఛటర్జీ, గోల్డ్‌మన్ సాచ్స్ సర్వీసెస్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రవి కృష్ణన్, స్థానిక పరిశ్రమ ప్రతినిధులు, సంస్థ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

సంస్థ యొక్క హైదరాబాద్ కార్యకలాపాలు ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, కన్స్యూమర్ బిజినెస్ సర్వీసెస్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో అవకాశాలతో 2021 మార్చిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యాలయంలో నూతన నియామకాలు, బెంగళూరు నుంచి అంతర్గత బదిలీలు కూడా భాగంగా ఉండటం చేత సమర్థవంతమైన జ్ఞాన బదిలీ, సంస్కృతి ధోరణిని నిర్ధారించడానికి, సంస్థ యొక్క ప్రతిభను పెంచే వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో 1,500 మంది నిపుణులు ఉన్నారు, దాదాపు 75 శాతానికి పైగా కొత్త నియామకాలు ఉన్నాయి.

ఈ కొత్త కార్యాలయం సలార్‌పురియా సత్వ నాలెడ్జ్ సిటీలో ఉన్న 3.51 లక్షల చదరపు అడుగుల తొమ్మిది అంతస్తుల టవర్‌ లో ఉంది. సుమారు 2,500 మంది నిపుణులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తమ న్యూయార్క్ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌మన్ సాచ్స్ అత్యధికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశం గా బెంగళూరు కార్యాలయంతో కలిపి, ఇండియా నిలిచింది.

స్థిరత్వం, ఉద్యోగుల శ్రేయస్సు పట్ల సంస్థ యొక్క విస్తృత నిబద్ధతకు ప్రతిబింబంగా, Opel ను అత్యధిక స్థాయి LEED, WELL ధృవీకరణలు, ISO14001 సర్టిఫికేషన్ సాధించడానికి తీర్చి దిద్దబడింది. సస్టైనబిలిటీ చర్యలలో తమ ప్రత్యక్ష కార్బన్ ఉద్గారాలలో 100 శాతం తగ్గించటం ద్వారా పర్యావరణంపై నికర-సున్నా ప్రభావాన్ని కలిగి ఉండటం, కేంద్రీకృత వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు, నీటి పునర్వినియోగ చర్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం, హైదరాబాద్ ఉద్యోగుల కమ్యుటేషన్ ప్రోగ్రామ్‌లో ఆన్‌సైట్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ప్రస్తుతం ఉన్న 190 వాహనాలకు అదనంగా 40 ఎలక్ట్రిక్ వాహనాలు జోడించబడతాయి. విడిగా, ఆఫీసు ఇంటీరియర్స్ కోసం సేకరించిన ఉత్పత్తులలో 70 శాతం స్థానిక విక్రేతల నుండి సేకరించబడ్డాయి. ఉద్యోగుల ఆరోగ్య చర్యలలో భాగంగా 100 శాతం ఎత్తు సర్దుబాటు చేయగల డెస్క్‌లు, ఎర్గోనామిక్ కుర్చీలు, ఆన్‌సైట్ ఫలహారశాల, ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించడానికి ప్రతి అంతస్తులో అనధికారిక సహకార స్థలం, మెరుగైన డిజిటల్ వర్క్‌ప్లేస్ టెక్నాలజీతో సమావేశ కేంద్రం, వైకల్యం, లింగ-తటస్థ విశ్రాంతి గదులు, నర్సింగ్, విశ్రాంతి, ధ్యాన గదులు, బయోఫిలియా వంటివి ఉన్నాయి. ఇతర సౌకర్యాలలో ఆన్-సైట్ వెల్నెస్ సెంటర్, సమీపంలోని పిల్లల సంరక్షణ, ఫిట్‌నెస్ సెంటర్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News