Friday, December 27, 2024

అంగరంగ వైభవంగా స్వర్ణకారుల బోనాలు

- Advertisement -
- Advertisement -
  • హాజరై బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్ టౌన్: ప్రతి ఆషాడ మాసంలో అమ్మవార్లకు తీసే బోనాల ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆద్వర్యంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల పండగ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై బోనమెత్తుకున్నారు. ఈ యేడు బిన్న సంస్కృతులతో అలరారుతూ నిర్వహించిన బోనాల పండగ సంబరాన్నంటాయి. డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మద్య బోనాల ఊరేగింపులు నిర్వహించారు. పట్టణంలోని వీధులకు చెందిన బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు.ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో కాంతరా, ఒగ్గుడోలు, బ్యాండే మేళాలు, డీజే సౌండ్‌ల మద్య యువకుల నృత్యాలతో దద్దరిల్లింది. అనంతరం ఊరేగింపుగా వెళ్లి కాళికాదేవి ఆలయం వద్ద అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ స్వర్ణకార అద్యక్షుడు చదువుల రమేష్‌చారి, సన్నోజి కృష్ణమాచారి, మామిడి ప్రభాకర్‌చారి, పూనం రవీందర్‌చారి, నాగేందర్‌చారి, నరసింహాచారి, శ్రీనివాస్‌చారి, దత్తు, ఆదర్శ్ చారి, రాజు చారి, రమేష్‌చారి, వెంకట్ చారి, కోట చారి, టీఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, లింగారెడ్డి, ప్రభురెడ్డి, నవీన్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News