ముంబయి: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా వశి తాలూకాలో ఆకాశం నుంచి ఓ స్వర్ణశిల పడి ఆశ్చర్యచకితులను చేసింది.ఓ రైతు శుక్రవారం తన పొలంలో పనిచేస్తుండగా అనూహ్యంగా ఆకాశం నుంచి బంగారు రాయి పడింది. రైతుకు ఏడెనిమిది అడుగుల దూరంలో అది పడింది.
‘దేవుడు తలచుకుంటే కనక వర్షమే’. ఆ బంగారు శిలను చూసిన రైతు కళ్లు ఆశ్చర్యచకితం అయ్యాయి. ఈ వార్త ఉస్మానాబాద్ అంతటా సంచలనం అయింది. సోషల్ మీడియాలోఇది ఎంతో వైరల్ వార్త అయిపోయింది. బంగారంలా మెరిసిపోతున్న ఈ సర్ణశిల రెండు కిలోలు ఉంది. దీనిపై అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వేరే గ్రహం నుంచి వచ్చి పడిందా? స్వర్ణశిల ఉన్న ఆ గ్రహం ఏమిటి? రైతు నెత్తి మీద పడకుండా ఏడడుగుల దూరంలో పడిన చమత్కారం ఏమిటి? ఆ రైతుకే దేవుడెందుకు ఈ చమత్కారాన్ని చూయించాడు? లేక ఇది సాధారణ విషయమేనా? …అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ రైత కాస్త బెదిరాడనే చెప్పాలి.
వాస్తవానికి జరిగిందేమిటంటే తుఫాను కారణంగా ఉస్మానాబాద్ జిల్లాలో వాన పడింది. దాంతో పొలం ఎలా ఉందో చూడడానికి రైతు వెళ్లాడు. అప్పుడే అనుకోకుండా ఈ ఘటన సంభవించింది. బెదిరిపోయిన ఆ రైతు వెంటనే ఈ విషయాన్ని తహసిల్దారు కార్యాలయానికి తెలిపాడు.
పసుపు వర్ణంలో ఉన్న ఈ రాయిని ప్రాథమిక విచారణ జరిపి భారతీయ భూవిజ్ఞాన విభాగానికి పంపారు. భౌతికశాస్త్రజ్ఞులు దీనిని మొదట్లో ఉల్కాపాతం అనుకున్నారు. ఈ రాయి పొడవు 7 అంగుళాలు, వెడల్పు 6 అంగుళాలు, మందం 6.5 అంగుళాలు ఉంది.
ఆకాశం నుండి పడ్డ ‘స్వర్ణశిల’
- Advertisement -
- Advertisement -
- Advertisement -