Monday, December 23, 2024

గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: గొల్ల కురుమలు ఆర్థికంగ ఎదగాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుందురుపల్లి ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి, ట్రయినీ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌ల చేతుల మీదుగా లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ యాదవుల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వారి కోసం మేకలు, గొర్లు సబ్సిడి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

యాదవుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని, రానున్న కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తమవంతు పాత్ర వారే పోషించే విధంగా తీర్చిదిద్దాలనేదే లక్షంతోనే సిఎం కెసిఆర్ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. నియోజకవర్గంలో అర్హులైన అందరికి గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News