Thursday, January 23, 2025

షర్మిలకు ఎంపి సాయం… ఆ ఎంపిని బెదిరించిన జగన్: గోనె

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ఎంఎల్‌ఎ గోనె ప్రకాశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతి కోసమే షర్మిల, విజయలక్ష్మిని సిఎం జగన్ దూరం పెట్టారని మండిపడ్డారు. తాను జైలు కెళ్తే భార్య భారతిని సిఎం చేయాలనేదే జగన్ వ్యూహమని చురకలంటించారు. షర్మిల రోడ్డెక్కడానికి కారణమెవరు? జగన్ కాదా? అని గోనె ప్రశ్నించారు. షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అడిగారు. షర్మిలను ఎపిలోని ఓ సిట్టింగ్ ఎంపి కలిశారని, ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇచ్చారని, విషయం తెలుసుకొని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆ ఎంపికి ఫోన్ చేసి బెదిరించారన్నారు. ఎందుకెళ్లావ్? సాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని బెదిరించారన్నారు. షర్మిల ఇంటి దగ్గర జగన్ ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారని, షర్మిలపై జగన్‌కు ఎందుకంతా కోపం ఉందని గోనె ప్రశ్నించారు.

Also Read: ఎంఎల్‌ఎలయింది చొక్కా విప్పి షో చేయడానికా?: లోకేష్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News