- Advertisement -
ప్రపంచ కప్ టైటిల్ పోరులో తెలుగు తేజం గొంగడి త్రిష సత్తా చాటింది. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష పైనల్లో బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో మెరిసింది. తొలుత ఇంగ్లాండ్ కెప్టెన్ స్క్రీవెన్స్‌ను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించింది. నాలుగో ఓవర్ చివరి బంతిని ఫుల్‌టాస్ వేయగాగ్రేస్ స్క్రీవెన్స్ భారీషాట్‌కు యత్నించింది.
గాల్లోకి లేచిన బంతిని నేలను తాకుతుండగా అద్భుతంగా ముందుకు డైవ్ చేసిన త్రిష కళ్లు చెదిరే క్యాచ్‌తో స్క్రీవెన్స్‌కు షాక్ ఇచ్చి పెవిలియన్‌కు పంపింది. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు సాధించి జట్టు విజయానికి దోహదపడింది. కుడిచేతివాటం బ్యాటర్ అయిన త్రిష ఫైనల్లో 29బంతుల్లో 3బౌండరీలతో 24పరుగులు చేసి సౌమ్య తివారీతో కలిసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.
- Advertisement -