Sunday, December 22, 2024

యాదాద్రిని అపవిత్రం చేయొద్దు: గొంగిడి మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

యాదాద్రిని అపవిత్రం చేయొద్దు ..

స్వాములతో దొంగ పనులు చేయిస్తారా..
దమ్ముంటే మోడీ వచ్చి ప్రమాణం చేయాలి: మహేందర్ రెడ్డి

యాదాద్రి: స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి నాయకులు యాదాద్రి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తాననడం సిగ్గు చేటు అని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. బిజెపి నాయకులు యాదాద్రిని అపవిత్రం చేయవద్దని, దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీ యాదాద్రి కి వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్టలో టిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రఘునందన్ రావు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి గో బ్యాక్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీ యాదాద్రికి వచ్చి ప్రమాణం చేసి నిరూపించాలని సవాలు విసిరారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ అధికారంలోకి రావాలని బిజెపి చూస్తుందని మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది వాస్తవం కాదని యాదాద్రి పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

Gongidi Mahender Reddy comments on BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News