Monday, March 3, 2025

యాక్షన్‌తో అదరగొడుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పాన్- ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ను తమ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ’గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తెలుగు సినిమాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టి -సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై -ప్రొఫైల్ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం తమిళ టీజర్ శుక్రవారం విడుదలై 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అదరగొట్టింది. శనివారం మేకర్స్ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ అజిత్‌ను నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా చూపించింది. ఈ యాక్షన్ -ప్యాక్డ్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్ ,ప్రభు కీలక పాత్రలలో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న వేసవిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News