Sunday, January 19, 2025

రేవంత్… ఆ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని బిఆర్‌ఎస్ నేత వినోద్ కుమార్ సలహా ఇచ్చారు. రైతుబంధు లేదా రైతు భరోసా గురించి మంత్రివర్గంలో చర్చించాలని, రైతు బంధు అనేది ఖరీఫ్, రబీ ముందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు రైతు బంధు పథకాన్ని ప్రశంసించారని, పిఎం కిసాన్ పథకానికి కూడా రైతు బంధు స్ఫూర్తి అని కొనియాడారు. రోహిణి కార్తీ సమయంలో పెట్టుబడి కోసం రైతులు తిరుగుతారని, ఇప్పుడు పంట వేసే ముందు రైతుబంధు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో రైతు బంధు పంటకోతల తరువాత రేవంత్ ప్రభుత్వం ఇచ్చిందని వినోద్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు భరోసా అమలు కాలేదని చురకలంటించారు. మంత్రవర్గ సమావేశంలో రైతలు పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.

జూన్ మొదటి వారం లోనే రైతులకు ఎకరాకు 7500 రూపాయలు విడుదల చేయాలని, ఆ దిశగా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని, వర్ష కాలంలోనే ఎక్కువగా సన్నవడ్లు పండిస్తారని, రబీలో నూకల శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు సన్న రకాలు సాగు చేయరని, క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందేనని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తిట్ల మీద కాకుండా రైతులకు మేలు చేయడం పై కేబినెట్ మీటింగ్ లో చర్చించాలని, బోనస్ ను బోగస్ గా మార్చకండని,  అసెంబ్లీ ఎన్నికలకు ముందు సన్నవడ్లకే బోనస్ అని రేవంత్ రెడ్డి అని అంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News