Sunday, January 19, 2025

కోహ్లీ త్వరగా ఔటవడం మంచిదే!

- Advertisement -
- Advertisement -

సునీల్ గావస్కర్
న్యూయార్క్ : విరాట్ కోహ్లీపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(52), వికెట్ కీపర్ రిషభ్ పంత్(36)లు రాణించారు. అయితే కింగ్ కోహ్లీ నిరాశ పరిచాడు.

కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరున్నాడు. దీనిపై స్పందించిన గావస్కర్ స్టార్ బ్యాటర్లు ఓ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకు ఔటవడం మంచిదే. ఈ మ్యాచ్‌లో విఫలమైతే మరుస మ్యాచ్‌లో వారు బ్యాట్ ఝలిపిస్తారు. ‘స్టార్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్ అవటంఇ వారిని చూశా.. వారు ఒక మ్యాచ్‌లో విఫలమైతే తరువాతి మ్యాచ్‌లో చెలరేగిపోతారు. రెట్టింపు పరుగులు రాబట్టాలని యోచిస్తుంటారు. కోహ్లీ తరువాతి మ్యాచ్ పాకిస్థాన్‌పై రాణించాలని ఆటోచనలో ఉన్నాట్టున్నాడు’ అని గావస్కర్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News