Monday, November 25, 2024

కష్టపడి క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -
  • మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్

మక్తల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్రీడా శాఖ ఆదేశాల మేరకు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడోత్సవాలలో భాగంగా నారాయణపేట జిల్లా సైక్లింగ్, షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులకు ఈ నెల 27న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మక్తల్ విశ్రాంత పిఈటీ బి. గోపాలం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 86 మంది క్రీడాకారిణులకు, క్రీడాకారులకు శాలువా, మెడల్‌తో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అథిలేటిక్స్ అధ్యక్షుడు పి. నర్సింహగౌడ్ , బి. గోపాలం, మాస్టర్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు హాజరై క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ క్రీడాకారులకు సన్మానం చేయడం వారి బాధ్యతను పెంచిందని, వారు కష్టపడి క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయని, సమాజంలో గౌరవం ఉంటుందని వారు తెలుపుతూ జిల్లాలో ఎవరు చెయ్యని కార్యక్రమాన్ని చేపట్టి, విజయవంతం చేసిన క్రీడల ప్రధాన కార్యదర్శి బి. గోపాలంను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు అంబదాస్, వంద మందికి అన్నదానం చేసిన రుద్ర సముద్రం రామలింగం, జాతీయ స్థాయి క్రీడాకారులు బి. రూప, శ్రీవాణి, బి. దీప, బి. శిల్ప, బి. పుష్ప, పి. సౌమ్య, శ్రీలత, అమ్రేష్, దామోదర్, రమేష్, స్వప్న, జయమ్మ, శ్రీలత, రేణుక, ఉపాద్యాయులు ఆశోక్, హనుమప్ప, భరత్, ఆనంద్ , వందమంది క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News