Saturday, November 23, 2024

సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన : మంత్రి

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్: రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వం లో పారదర్శకమైన సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్‌లలో రూ.25 కోట్ల హెచ్‌ఎండిఎ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సం క్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

అంతకుముందు కార్పొరేషన్ పరిధిలోని 15, 26, 27, 25, 23, 24, 22, 28,3,19,18,16 డివిజన్‌లలో తలపెట్టిన భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అరుందతినగర్‌లో రూ. 1కోటి నిధులతో స్మశానవాటిక అభివృద్ధికి, నోబుల్ స్కూల్ వద్ద బస్తీ దవాఖానాకు మంత్రి భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు జవహర్‌నగర్‌లో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరిగాయని, సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు ఎప్పటికి రుణపడి ఉంటామన్నారు.
కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం ..
దివ్యాంగుల పింఛన్ మరో వెయ్యి రూపాయలు పెంచడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి దివ్యాంగులతో కలిసి మంత్రి క్షీరాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.దివ్యాంగుల ఆసరా పింఛన్‌ను రూ.4016కు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించడం ఎంతో సంతోషకరమని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు మొనార్‌దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్,కమిషనర్ రామలింగం, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చామకూర మహేందర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు, జిల్లా సీనియర్ నాయకులు ఆలూరి రాజశేఖర్,కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News