Wednesday, December 25, 2024

యోగాసనాలతో చక్కని ఆరోగ్యం : ఎంఎల్‌ఎ వివేకానంద్

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జె. గార్డెన్స్ లో 129 సూరారం డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ బ్రహ్మ కుమారీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ వార్షికోత్సవంలో ఆదివారం రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో శివ శక్తి ధ్యాన యోగ వారి ఆ ధ్వర్యంలో చిన్నారులచే యోగ విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ వారు ఏర్పాటు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందు ఉంటాను అని అన్నారు.

ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం యోగాసనాలు తప్పనిసరిగా చేయాలనీ ఒక దినచర్యగా అనుసరించాలి అని అన్నారు. మానసిక ప్రశాంతత వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉం టారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.కె. శారదా దీదీ జి, బి.కె. సరోజ దీదీ జి, జ్యోతి దీదీ జి, షాపూర్ నగర్ సెంటర్ ఇంచార్జి మంజుల, మాజీ కార్పొరేటర్ పాల కృష్ణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, సీనియర్ నాయకులూ అత్తిరి మారయ్య, వేణు యాదవ్, యోగ గురూజీ మల్లేష్, పూర్ణ సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News