Thursday, January 23, 2025

మంచి జీవన విధానాన్ని అవలంభించాలి…

- Advertisement -
- Advertisement -

జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

మెదక్: మంచి జీవన విధానాన్ని అవలంబించాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి ఆర్మ్‌డ్రిల్, పుట్ డ్రిల్‌ను జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐ అచ్యుతరావు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ పిట్నెస్‌తోపాటు, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయమం చేయడం అనేది చాలా ముఖ్యమని, మంచి శక్తి సామర్థాలతో ఎలాంటి ఆనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. ఫిట్నెస్‌ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకోవాలన్నారు. వ్యాయమాన్ని నిత్య జీవితంలో బాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News