- Advertisement -
హైదరాబాద్: యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖీ’. జనవరి 28న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కొద్దిసేపటిక్రితం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
‘Good Luck Sakhi’ Movie Trailer Released
- Advertisement -