Monday, January 20, 2025

కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ అవార్డు అందుకున్న యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్ లక్ సఖీ’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మూవీ మేకర్స్ ప్రకటించారు. జనవరి 28న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Good Luck Sakhi to released on Jan 28th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News