Monday, December 23, 2024

విజయ కృష్ణ బ్యానర్‌లో మంచి సినిమాలు చేస్తాం

- Advertisement -
- Advertisement -

Actor Naresh complains about Rs 10 crore fraud

సీనియర్ నటుడు నరేష్ వికె యాక్టర్‌గా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతుండటంతో.. ఈ ఏడాది నుంచి తమ నిర్మాణ సంస్థలో కొత్త సినిమాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ “1972లో పండంటి కాపురం సినిమాతో తెరంగేట్రం చేశాను. నాకు నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంత జర్నీ చేసేందుకు కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు థ్యాంక్స్. నా గురువు జంధ్యాలకి థ్యాంక్స్. ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవకు అంకితం చేశాను. పొలిటికల్‌గా కూడా వెళ్లాను. అలానే ఇండస్ట్రీలో పుట్టిన బిడ్డగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం పాటు పడ్డాను. యాభై ఏళ్ల ప్రయాణం తరువాత ఇప్పుడు కూడా కొత్త కొత్త పాత్రలు వేస్తున్నాను. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది. మీనా, కవిత, హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం అనే ఎన్నో గొప్ప చిత్రాలను తీశారు. విజయ కృష్ణ మూవీస్‌ను విజయ కృష్ణ గ్రీన్ స్టూడియ్స్‌గా మార్చాం. ఈ ఏడాదితో అమ్మ పేరుతో ఈ స్టూడియోను అందిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని కృష్ణ అభినందించారు. మా బ్యానర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్‌గా మంచి సినిమాలను ఈ ఏడాది అందించాలని నిర్ణయించుకున్నాం. ఇక ఈ ఏడాది కూడా మంచి చిత్రాలతో రాబోతున్నాను. మైత్రీ, నాని సినిమా ‘అంటే సుందరానికి’, నందినీ రెడ్డి ‘అన్నీ మంచి శకునాలే’ సినిమాలు చేస్తున్నాను. వరుణ్ తేజ్ ‘గని’లో మంచి రోల్ చేస్తున్నాను. వైష్ణవ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News