Monday, December 23, 2024

‘చాలా రోజుల తర్వాత మంచి వార్త’

- Advertisement -
- Advertisement -

ఐఎఎస్ స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లేడీ ఐఎఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ బిల్కిస్ బానో కేసు తీర్పుపై స్పందించారు. ఈ ఇష్యూపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె రియాక్ట్ అయ్యారు. “చాలా రోజుల తర్వాత మంచి వార్త. బిల్కిస్ బానో మాత్రమే కాకుండా మహిళల అందరి విశ్వాసాన్ని పెంచింనందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు” అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

కాగా, 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితుల్లో 11 మందిని సత్ప్రవర్తన కింద ముందుగానే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం విదితమే. ప్రభుత్వ తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా నిందితులను విడుదల చేయడాన్ని బాధితు రాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. నిందితులను ముందుగానే విడుదల చేయడాన్ని తప్పుపట్టి రెండు వారాల్లోగా 11 మంది జైల్లో సరెండర్ కావాలని ఆదేశించింది.

Bilkis Bano

Culprits

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News