Saturday, November 16, 2024

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. అందుబాటులోకి ప్రపంచస్థాయి కోర్సులు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యారంగంలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎడెక్స్ ప్రతినిధులతో ప్రభుత్వం ఎంఓయు చేసుకున్న సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు రెండువేలకు పైగా ప్రపంచస్థాయి కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచ వర్శిటీ అధ్యాపకులతో ఆన్ లైన్ లో బోధన జరుగుతుందని చెప్పారు. ఈ కోర్సులకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రముఖ యూనివర్శిటీల కోర్సులను దీనిద్వారా నేర్చుకోవచ్చునని చెప్పారు.  మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీ పడాలని, అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News