అమరావతి: జగన్ ప్రభుత్వం ఎపి ఆర్‌టిసి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి ఒకటో తారీఖున జీతంతో పాటు నైట్ హాల్ట్ అలవెన్స్ కూడా వేస్తామని ఎపిఎస్‌ఆర్‌టిసి సంస్థ ఇడి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పెండింగ్ బకాయిలను కూడా ఫిబ్రవరి 1న అందిస్తామని, ఉద్యోగుల సంక్షేమంతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని వివరించింది. నైట్ ఔట్, డే ఔట్, ఓవర్ టైమ్ అలవెన్స్‌లను ఉద్యోగులకు ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లించింది. గత ఏడు సంవత్సరాల నుంచి బకాయిలు పేరుకపోవడంతో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 నుంచి పే రివిజన్ బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్‌కు చెల్లించాల్సిన నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. మొత్తం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 1న అందే వేతనంతో పాటు నైట్ హాల్ట్‌లు అలవెన్సులు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆర్‌టిసి ఉద్యోగులకు గుడ్ న్యూస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -