Tuesday, January 21, 2025

అయ్యప్ప భక్తులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

శబరిమలను సందర్శించే అయ్యప్పస్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2025 జనవరి 20వ తేదీ వరకు కేరళలోని శబరిమలను సందర్శించే భక్తులు విమానాలలో క్యాబిన్ బ్యాగేజీలో కొబ్బరికాయలను తీసుకెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శనివారం ప్రకటించారు. రెండు నెలల శబరిమల యాత్రా సీజన్ నంబర్ నెల మధ్యలో పారంభం కానున్నది.

అయ్యప్ప భక్తులు తమ క్యాబిన్ బ్యాగేజీలో కొబ్బరికాయలను తీసుకెళ్లడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బిసిఎఎస్) అనుమతి ఇచ్చింది. ఇవి పేలుడు సామగ్రి పరిధిలోకి రానందున అయ్యప్ప భక్తుల ఇరుముడిలో కొబ్బరికాయలను అనుమతించాలని బిసిఎఎస్ నిర్ణయించింది. ఈ ఉత్తర్వు 2025 జనవరి 20 వరకు అమలులో ఉంటుందని, అవసరమైన అన్ని సెక్యూరిటీ చెకింగ్‌లు యథాప్రకారం ఉంటాయని మంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News