Saturday, June 29, 2024

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు, వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలపై త్వరలోనే శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతన పెంపుతో పాటుగా వారానికి అయిదు రోజుల పని విధానం అమలు చేయడంపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు శనివారం ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు ఆ పత్రిక తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముందని ఆ కథనం పేర్కొంది. బ్యాంకు యాజమాన్యాలతో కూడిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్( ఐబిఎ)ఉద్యోగులకు 15 శాతం జీతాల పెంపునకు సుముఖంగా ఉంది. అయితే అంతకంటే ఎక్కువ జీతాలు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొవిడ్ మహమ్మారి సమయంలోనూ అవిశ్రాంతంగా సేవలు అందించడం,

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటుగా ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ఆ మేర మెరుగైన వేతనాలు ఇవ్వాలని ఉద్యోగుల సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలవడే అవకాశం ఉంది. మరో వైపు వారానికి అయిదు రోజుల పని విధానంగురించి ప్రభుత్వానికి ఐబిఎ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించింది. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బిఐ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి)లో ఐదు రోజుల పనివిధానం అమలవుతోంది.దీంతో బ్యాంకులు, ఉద్యోగ సంఘాలు ఈ డిమాండ్‌ను తెరమీదికి తెచ్చాయి. ప్రస్తుతం బ్యాంకులకు రెండు, నాలుగు శనివారాలు సెలవుదినంగా ఉంది. ఒక వేళ కొత్త విధానం అమలులోకి వస్తే బ్యాంకులు వారంలో అయిదు రోజులపాటే అందుబాటులో ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News