Sunday, January 5, 2025

Good News : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు త్వరలో శుభవార్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు త్వరలో శుభవార్త రాబోతోంది. అంగీకారం కుదిరినట్లుగా కరువు భత్యంను మూడు శాతం పెంచబోతోంది. ప్రస్తుతం 42 శాతం ఇస్తుండగా, మూడు శాతం పెంచి 45 శాతం ఇవ్వబోతోంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో వెల్లడించే ‘పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ(సిపిఐఐడబ్లు) ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది.

కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో లేబర్ బ్యూరో పని చేస్తోంది. సిపిఐఐడబ్లు ఆధారంగా కరువు భత్యాన్ని నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులకు వర్తిస్తుంది. ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ, 2023 జూన్ నెల సిపిఐఐడబ్లును జూలై 31న విడుదల చేశారన్నారు. కరువు భత్యం నాలుగు శాతం పెంచాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ ప్రభుత్వం మూడు శాతానికి కొంచెం ఎక్కువ ఉండవచ్చునని, దశాంత స్థానాలకు మించి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించదని చెప్పారు. కాబట్టి డీఏ మూడు శాతం పెరగవచ్చునని, అంటే 45 శాతం డీఏ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం కరువు భత్యం పెంపు ప్రతిపాదనను తయారు చేస్తుందన్నారు. దీనివల్ల ఖజానాకు ఎదురయ్యే పర్యవసానాలను కూడా వివరిస్తుందన్నారు. దీనిని కేంద్ర కేబినెట్ ఆమోదించవలసి ఉంటుందన్నారు.

పెంచిన డీఏ 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. ప్రస్తుతం దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు కరువు భత్యాన్ని పొందుతున్నారు. ఈ ఏడాది మార్చి 24న కూడా డీఏ సవరణ జరిగింది. దీనిని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News