Wednesday, January 22, 2025

ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త

- Advertisement -
- Advertisement -

ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు అందిస్తున్న అన్ని రకాల ఆఫర్లను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అందిస్తున్న ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. సూపర్ సేవర్- 59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ వంటి ఆఫర్లు వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఈ పొడిగింపు పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో అక్టోబర్ 6 నుంచి నామమాత్రపు పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు కూడా ఈ ప్రకటనలో మెట్రో సంస్థ పేర్కొంది. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండి కెవిబి రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News