మంత్రి సీతక్క చొరవతో రెన్యూవల్ ఫైల్‌పై
సిఎం రేవంత్ రెడ్డి సంతకం గిరిజన
సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న
3వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి
మన తెలంగాణ/ హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది. రెన్యువల్ కు సంబంధించిన ఫైలు గత కొంతకాలంగా పెం డింగ్‌లో ఉన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రా మీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మం త్రి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని రె న్యువల్‌పై అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి సీతక్క సోమవారం భేటీ అయి చర్చించారు. సిఆర్‌టి రెన్యువల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో సిఆర్‌టి రెన్యువల్ ఫైల్ పై వెనువెంటనే సీఎం రేవంత్ రెడ్డి సంతకం చే శారు. గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో మూ డు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను రెన్యువల్ చేసినందుకు మంత్రి సీతక్క సీఎం రే వంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు శుభవార్త
- Advertisement -
- Advertisement -
- Advertisement -