Friday, November 15, 2024

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

- Advertisement -
- Advertisement -

ఆదిభట్ల : పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతుధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు వివరాలను జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ ఛాయాదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు. పత్తిరైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పండించిన పంటను దళారులకు విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పత్తిమద్దతుధర పింజపొడవు పత్తికి రూ.7020గా, మధ్యస్థ పింజపొడవు పత్తి ధర రూ.6020గా ప్రకటించింది. రైతులు తాము పండించిన పత్తిని దళారులకు విక్రయించరాదని కేంద్రం సూచించింది. అలాగే పత్తిరైతులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలను చేసింది.

పత్తి తేమ శాతం 8 నుండి12 శాతం లోబడి ఉండాలని పేర్కొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడే కొనుగోలు కేంద్రాల్లో రైతులు స్వయంగా వచ్చి తమ పంటను విక్రయించాలని సూచించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆధార్ ధృవీకరణ అనంతరం రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. రైతులు తమ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు లింక్‌చేసి ఉండాలని సూచించింది. ఆధార్‌కార్డు లేని పక్షంలో రైతులు తాము నమోదుచేసుకున్న ఆధార్ నంబర్ రశీదుతో ఏదైనా దృవీకరణ పత్రముతో కొనుగోలు కేంద్రాల్లో సందర్శించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News