Monday, January 20, 2025

వేసవిలో తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

తిరుపతి:  వచ్చే మూడు నెలల్లో తిరుమలలో  భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తోంది టిటిడి. వచ్చే మూడు నెలల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన డయల్ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం వేసవిలో ఏర్పాట్లపై వివరాలను వెల్లడించారు. వేసవిలో విఐపి బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయాలని టిటిడి బోర్డు తీర్మానం చేసిందని.. తద్వారా సాధారణ భక్తుల దర్శనానికి ఎక్కువ సమయం ఉండేలా చూస్తామన్నారు.

సాధారణ భక్తుల సౌకర్యార్థం సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు ఇస్తూ సిఫార్సు లేఖలపై విఐపి దర్శనాన్ని టిటిడి రద్దు చేసిందని తెలిపారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, బయట లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, అల్పాహారం, నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు. వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే తిరుమల మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్‌ వేయించడంతో పాటుగా తాగునీరు పాయింట్లు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉండటంతో టిటిడి సిఫార్సు లేఖల్ని అనుమతించడం లేదు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.. కాబట్టి జూన్ 10 వరకు ఈ లేఖల్ని అనుమతించే అవకాశం ఉండదని సమాచారం.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News