సిటీ బ్యూరో ః డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త …. సెప్టెంబర్ 2వ తేదీన పంపినీ చేయనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియగురువారం ఉదయం 10.30 గంటలకు లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోప్రారంభం కానుంది. జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసి) రూపొందించిన సాప్ట్‌వేర్ ఆధారంగా ఆన్ లైన్ లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంత్రులు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రోస్ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగు తుందన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 1,64,647 దరఖాస్తులు అందగా ఇందులో నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 58,181 మందిని అర్హులుగా గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
మొదటి విడుతగా ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది చోప్పున 7500 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నమన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎన్‌ఐసి సహాకారంతో ప్రత్యేకంగా (ట్యాంపర్ ప్రీ) సాప్ట్‌వెర్‌ను రూపొందించి తద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆన్‌లైన్ లాటరీ పద్దతిలో లబ్దిదారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ సాప్ట్‌వేర్ జాతీయ సమచాఆరం కేంద్రం అభివృద్ది చేయడంతో పూర్తి పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. తదుపరి దశలో సైతం ఈ సాప్ట్‌వేర్ ఆధారంగానే ఇళ్లను కేటాయింపులు ఉంటుందని, ఒక్కసారి ఎంపిక చేయబడిన లబ్దిదారులు మళీ ఎంపిక కాకుండా ఆధార్ నెంబర్‌ను ప్రాతిపదికన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఇళ్ల కేటాయింపు సమయం, తేదీ తో సహా సాప్ట్‌వేర్‌లో నమోదు అవుతుందని, ఈ డేటాను ఏ విధంగానూ తారుమారు చేయడానికి వీలు లేకుండా రహస్య కోడ్ ద్వారా నమోదు చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు.