Thursday, January 23, 2025

డిఎస్‌పి ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త : పల్లా

- Advertisement -
- Advertisement -

Good news for DSP job seekers

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల ఎత్తు అర్హతను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గ్రూప్ -1 ఉద్యోగ నియామకాలలో డిఎస్‌పి ఉద్యోగ అభ్యర్థుల ఎత్తు అర్హతను 167 cms నుంచి 165 cmsకు తగ్గించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిజిపికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. రాష్ట్ర యువత తరఫున కెసిఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News