Thursday, January 23, 2025

ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెల్లించాల్సిన అలవెన్స్‌లను 01.01.2022 నుంచి 31.05.2023 వరకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మెమోను జారీ చేశారు. దీనికి సంబంధించిన కాపీలను అన్ని జిల్లాల ట్రెజరీ, అకౌంట్స్ అధికారులకు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆర్ధికశాఖ పంపించింది.

ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన పదవీ విరమణ చేసే ఉద్యోగుల బకాయిలను నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని ఆర్థిక శాఖ ఈ మెమోలో తెలిపింది. దీంతోపాటు సిపిఎస్ పథకం కింద ఉన్న ఉద్యోగులకు సంబంధించి 10 శాతం బకాయిలను వారి ఖాతాలో జమచేయనున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. అకౌంట్స్ అధికారులు, ట్రెజరీ అధికారులు ఈ చెల్లింపులను సక్రమంగా జరపడంతో పాటు వాటి కాపీలను జిల్లా అధికారులకు అందచేయాలని ఆర్ధిక శాఖ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News