Sunday, January 19, 2025

ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాసుదారులకు టిఎస్ ఆర్టీసి శుభవార్త

- Advertisement -
- Advertisement -

ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాసుదారులకు టిఎస్ ఆర్టీసి శుభవార్త తెలిపింది. ఈ పాస్ ఉన్న వారు ఇప్పటి వరకు కేవలం ఎక్స్ ప్రెస్, ఆర్టీనరి బస్సుల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుండేది. తాజాగా ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టిఎస్ ఆర్టీసి కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ పాసుదారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని ఆర్టీసి ఎండి సజ్జనార్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

కాగా ఈ కాంబినేషన్ టికెట్ సదుపాయాన్ని వినియోగించుకొని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన సూచించారు. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు టిఎస్ ఆర్టీసికి చెందిన స్థానిక బస్‌పాస్ కౌంటర్లను సంప్రదించాలని ఎండి సూచించారు. తాజా నిర్ణయంతో నెల పాసు వాడే వారికి భారీ ఉపశమనం కలిగినట్లైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్ వల్ల ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో నిలబడటానికి కూడా చోటు దొరకడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News