Saturday, January 4, 2025

అన్నదాతకు గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

పిఎం ఫసల్ బీమా యోజన
కేటాయింపులు భారీగా పెంపు
రూ. 69,515కోట్లు కేటాయిస్తూ
కేంద్ర కేబినెట్ నిర్ణయం రైతుల
పంటలకు పెరగనున్న బీమా
డిఎపి ఎరువుల రాయితీకి
రూ.3,850కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
ఈ ఏడాది తొలి కేబినెట్ భేటీ
అన్నదాతకు అంకితం : మోడీ

న్యూఢిల్లీ : పంటల బీమా పథకమైన ప్రధాన మంత్రి ఫసల్‌బీ మా యోజనను మరింతగా మెరుగుపర్చాలని, కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్న కేంద్రం , కేటాయింపులను రూ. 69, 515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. దీం తో రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతోపాటు న ష్టాల పట్ల ఆందోళన తగ్గనుంది. అలాగే 50 కిలోల డిఎపి ఎ రువుల బస్తాను రూ. 1350 చొప్పున రైతులకు అందజేసేందు కు రూ. 3850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోడీ నేతృత్వం లో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

2025లో తొలి క్యాబినెట్ భేటీని ప్రధాని మోడీ రైతులకు అంకితం చేశారన్న అశ్వినీ వైష్ణవ్, రైతుల సంక్షేమం గురించి ఈ భేటీలో చర్చ జరిగిందన్నారు. రెండు పంటల బీమా పథకాలను ( ప్రధాన మంత్రి ఫ సల్ బీమా యోజనపిఎంఎఫ్‌బివై, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్‌ఆర్‌డబ్లు బిసిఐఎస్) పథకాలను కేంద్రం 20 2526 వరకు పొడిగించినట్టు తెలిపారు. వీటిని 15 వ ఆర్థిక సంఘం కాలానికనుగుణంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ట్టు పేర్కొన్నారు. పిఎంఎఫ్‌బివై, ఆర్‌డబ్లుబిసిఐ పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 66,550 కోట్లు కేటాయించగా, దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ. 69,515 . 71 కోట్లకు పెంచారు. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ డిఎపి ఎరువులపై అదనపు భారాన్నిభరించాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు.

2024 చివరి వరకు ఎరువుల సబ్సిడీ కింద రూ. 11.9 లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. అదే విధంగా 2024లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రైతుల కోసం రూ. 6 లక్షల కోట్ల విలువైన 23 కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. ఈ పంటల బీమా పథకాల అమలులో సాంకేతికతను వినియోగించేందుకు రూ. 824.77 కోట్ల కార్పస్‌తో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంతో పంటనష్టం అంచనాలను త్వరగా తెలుసుకోవడంతోపాటు క్లెయిమ్ సెటిల్‌మెంట్, వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయాలపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేస్తూ, ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం. 2025 మొదటి క్యాబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశాం. వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News