రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మనకోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యో గులకు చేయాల్సినవన్నీ చేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని వెల్లడిం చారు. ధనిక రాష్ట్రంగా ఉన్నప్పడే డిఎ ఇవ్వడానికి రెండు నుంచి ఏడేళ్ల పాటు సమయం తీసుకున్నారు. ఇప్పుడు అంత సమయం తీసుకోకుండా ఆ డిఎలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. త్వరలోనే శుభవార్త వింటారన్నారు. అయితే ఇదే సమయంలో ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గృహజ్యోతి స్కీమ్ (200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్)కు అర్హత ఉండి కూడా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక 200 యూనిట్లలోపు ఏ కుటుంబం వారు వాడుకున్నా, వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 200 యూనిట్ల లోపు వాడుకుంటున్న వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదన్నారు. గ్రామమసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగిందన్నారు. అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామన్నారు.
అర్హతకలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండ ల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచచ్చు. ఇదొక నిరంతరంగా జరిగే కార్యక్రమమని వెల్లడిం చారు. అయితే 200 యూనిట్ల పైబడిన వారికి విద్యుత్ బిల్లులు కట్టుకుంటున్నారని, ఆ తర్వాత వారికి గృహజ్యోతి స్కీమ్ అందడం లేదని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… 200 యూనిట్ల లోపు గృహజ్యోతి స్కీమ్ వర్తిస్తుందని.. ఒకవేళ ఒక నెల ఎక్కువ వచ్చి బిల్లు కట్టుకున్నప్పటికీ మరుసటి నెల 200 యూనిట్ల లోపు వచ్చిన ఎడల జీరో బిల్లు వస్తుందని ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు.